Sathyam Sundaram: తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో కార్తీ చిత్రం

Sathyam Sundaram: కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్లు కార్తీ , అరవింద్‌ స్వామి లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం మెయ్యళగన్‌. 96 ఫేం ప్రేమ్‌ కుమార్‌ సీ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ’సత్యం సుందరం’ పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 28న తెలుగు రాష్టాల్ల్రో విడుదలవుతోంది.

సోమవారం ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయమొకటి చెప్పి అందరిలో జోష్‌ నింపాడు. ఇటీవలే నేను ఓ స్క్రిప్ట్‌ గురించి చర్చించేందుకు కార్తీని చెన్నైలో కలిశానని చెప్పాడు.

Sathyam Sundaram: ‘ఊపిరి’ తర్వాత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ సత్యం సుందరం: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి

ఆ తర్వాత తాను కథకు ఇంప్రెస్‌ అయ్యానని.. అది మాస్‌ రోల్‌ అని కార్తీ అన్నాడు. ఈ కామెంట్స్‌తో ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కార్తీ జాయిన్‌ అయ్యే అవకాశాలున్నాయని ఫిక్సయిపోతున్నారు అభిమానులు, మూవీ లవర్స్‌. ప్రశాంత్‌ వర్మ ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.

కార్తీ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కార్తీ` ప్రశాంత్‌ వర్మ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. ప్రశాంత్‌ వర్మ మరోవైపు హనుమాన్‌ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ జై హనుమాన్‌ను కూడా లైన్‌లో పెట్టాడని తెలిసిందే.

మూసుకొని సినిమాలు చేస్కో | Pawan Kalyan Reacts On Karthi Comments On Tirumala Laddu | Telugu Rajyam