ఉక్రెయిన్‌పై రష్యన్ సేనలు భీకర దాడులకు పాల్పడుతన్నాయి. రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంపై బాంబులు విసిరాయి. ఈ దాటికి ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్-225 ‘మ్రియా’ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ధృవీకరించారు. అయితే ఈ విమానాన్ని మళ్లీ పునర్‌నిర్మిస్తామని ఉక్రెయిన్ తెలిపింది. బలమైన ప్రజాస్వామ్య ఐరోపా దేశంగా ఉక్రెయిన్‌ను తీర్చిదిద్దుతామని ఆ దేశ నాయకులు వ్యాఖ్యానించారు. మ్రియా విమానాన్ని కూల్చారు కానీ, మా కలను మాత్రం ధ్వంసం చేయలేరని ఉక్రెయిన్ పేర్కొంది