ట్రైలర్ అదిరింది: జీనీగా వెంకటేష్‌.. అల్లాదిన్‌గా వరుణ్‌తేజ్‌

‘అల్లాదిన్‌’పిల్లలకు పరిచయమక్కర్లేని పేరు. బుల్లితెరపై కార్టూన్‌ సీరియల్‌గా కొన్నేళ్లపాటు చిన్నారులను అలరించిన ఈ ‘అల్లాదిన్‌’ త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్నాడు. అల్లాదీన్, జీనీల జంట తన మాయలు, మంత్రాలు, సాహసాలతో వెండితెరపై వినోదాల విందును పంచటానికి రెడీ అవుతోంది.

Aladdin | Trust | Telugu - Varun Tej, Venkatesh Daggubati | In Cinemas May 24

గాయ్‌ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అల్లాదిన్‌’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో జీనీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కనిపించనున్నాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్‌ నటిస్తుండగా, ప్రిన్స్‌ జాస్మిన్‌గా నయోమి స్కాట్‌ అలరించనుంది. అయితే, జీనికి టాలీవుడ్‌ స్టార్ హీరో వెంకటేష్‌ డబ్బింగ్ చెప్పగా, అల్లాదిన్‌కు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ‘ఎఫ్‌2’లో అలరించిన వీరిద్దరూ జీనీ-అల్లాదిన్‌ వాయిస్‌లతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అల్లాదిన్‌’ ఈ చిత్రం మే 24, 2019న విడుదలకానుంది.