బంగాళదుంపలో సమృద్ధిగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్ లభ్యమవుతాయి. బంగాళా దుంపల్లో అత్యధికంగా గ్లూకోజ్ నిల్వలు ఉంటాయన్న ఉద్దేశంతో చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. వీటిని ఎక్కువగా తింటే అతి బరువు సమస్య ఏర్పడి డయాబెటిస్ కి కారణమవుతుందన్న అపోహ చాలామందిలో ఉంది.ఇందులో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే మోతాదుకు మించి తినకూడదు అంతే.ఈ విషయం పక్కన పెడితే తాజా అధ్యయనం ప్రకారం చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో బంగాళాదుంప రసం అద్భుతం ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జిడ్డు చర్మం, పొడి చర్మం సమస్యలతో బాధపడేవారు బంగాళదుంప రసాన్ని తీసి తాజా పెరుగులో కలుపుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసి మెత్తని మిశ్రమంగా మార్చుకున్న తర్వాత ముఖ చర్మం పై సున్నితంగా మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ముఖానికి అప్లై చేస్తే బంగాళాదుంప లోని సహజ యాక్సిడెంట్లు, ప్రోటీన్స్ మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.అలాగే బంగాళదుంప రసంలో నిమ్మ రసాన్ని కలిపి ముఖంపై అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే వీటిల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే చెడు మలినాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బంగాళాదుంప రసాన్ని మరియు కీరదోస రసాన్ని సమ పరిమాణంలో తీసుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై మర్దన చేసుకుంటే చర్మంపై ఏర్పడే నల్లని వలయాలు, చర్మం ముడతలు, కళ్ళ కింద నల్లని చారలు వంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. కలబంద గుజ్జులో బంగాళదుంప రసాన్ని కలిపి ముఖంపై అప్లై చేసుకుంటే ఇందులోని యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సమస్యలకు కారణమయ్యే సూక్ష్మజీవులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐదు స్పూన్ల బంగాళ దుంప రసం, ఒక స్పూన్ బేకింగ్ సోడాను కలిపి అందులో సరిపడేంత నీటిని కలిపి ముఖంపై మర్దన చేసుకుంటే మొటిమలు, మచ్చలు, వంటి చర్మ సమస్యలు తొలగిపోతాయి.