కుక్క కాటుకు గురైన వ్యక్తులు వెంటనే చేయాల్సిన పనులు ఇవే?

సాధారణంగా కొన్నిసార్లు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని కుక్కలు మన వెంటపడి కరవడం జరుగుతుంది. ఇలా కొన్నిసార్లు అనుకొని ప్రమాదాల కారణంగా కుక్క కాటుకు గురి కావాల్సి ఉంటుంది.ఈ విధంగా కుక్కుకాటుకు గురైన వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.ముందుగా మనకి ఏ ప్రదేశంలో అయితే కుక్క కరిచిందో ఆ ప్రదేశాన్ని సబ్బుతో ఆ గాయం మొత్తం శుభ్రంగా కడగాలి. అనంతరం గోరువెచ్చని నీటిలోకి కాస్త ఉప్పును వేసి పది నిమిషాల పాటు గాయం అయినచోట ఆ నీటిని పోస్తూ ఉండాలి.

ఇలా చేసిన తర్వాత శుభ్రమైన గుడ్డ తీసుకొని గాయం మొత్తం తుడిచి స్టెరిలైజ్డ్ బ్యాండేజ్ తో చుట్టుకొని అనంతరం డాక్టర్ని సంప్రదించాలి.అయితే ముందుగా మనకు ఎలాంటి కుక్క కరిచిందనే విషయాన్ని తెలుసుకోవాలి ఒకవేళ పిచ్చి కుక్క కనుక కరచి ఉంటే డాక్టర్లు మనకు వేరే ట్రీట్మెంట్ ఇస్తారు కనుక మనకు ఏ కుక్క కరిచిందనే విషయాన్ని తెలుసుకోవాలి.డాక్టర్లు ఇచ్చిన మందులు సలహాలు సూచనలను తప్పకుండా పాటించడం వల్ల రేబిస్ అనే వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

కుక్క కాటుకు గురవటం వల్ల రేబిస్ అనే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ప్రాణాంతకంగా మారుతుంది. అయితే డాక్టర్ని సంప్రదించిన అనంతరం గాయం చుట్టూ దద్దుర్లు ఏర్పడటం లేదా వాపు రావడం జ్వరం రావడం అంటే లక్షణాలు కనపడిన తిరిగి మరోసారి డాక్టర్ని సంప్రదించి సరైన సూచనలు పాటించాలి. ఇకపోతే ఎవరింట్లో అయితే కుక్కలను పెంచుకుంటారో అలాంటి వారు తప్పకుండా కుక్కలకు వ్యాక్సినేషన్ వేయించడం ఎంతో అవసరం. ఇలా వ్యాక్సిన్ వేయించడం వల్ల కుక్క కరిచినప్పటికీ పెద్దగా ప్రమాదం జరగదు.