నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా… ఈ సమస్యను అధిగమించే అద్భుతమైన మార్గాలివే?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత చాలా అవసరం. మనసు ప్రశాంతంగా ఉండి పని ఒత్తిడిని అధిగమించాలంటే సహజమైన సుఖప్రదమైన నిద్ర తప్పనిసరి. ఈ ఆధునిక ప్రపంచంలో వేగంగా మారుతున్న జీవన ప్రమాణాలు, వృత్తిపారమైన ఒత్తిడి,
ఆహారపు అలవాట్లు, అనారోగ్యo వంటి కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధ‌ప‌డుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

దీర్ఘ కాలం పాటు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతూ భవిష్యత్తులో ఉబకాయం, గుండె జబ్బులు, రక్త పోటు, డయాబెటిస్,అల్జిమర్ వంటి ప్రమాదకర వ్యాధులతో జీవితాంతం పోరాటం చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నిద్రలేమ సమస్యను అధిగమించడానికి కొందరు నిద్ర మాత్రలకు, మద్యపానo, ధూమపానం వంటి అలవాట్లకు బానిసలుగా మారి మరికొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు.

మన మెదడు కింది భాగంలోని పీయూష గ్రంథి స్రవించే మెల‌టోనిన్ అనే హార్మోన్ మనలో సుఖప్రదమైన నిద్ర కలగడానికి కారణం అవుతుంది.ఈ గ్రంధి సేవించే హార్మోన్ మోతాదులను బట్టి మన నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవారికి వైద్యులు కృత్రిమ మెలటోనిన్‌ హార్మోన్‌ను సూచిస్తుంటారు. అయినా ఈ కృత్రిమ హార్మోను ఎక్కువ రోజులు తీసుకున్న మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక సహజ మెల‌టోనిన్ హార్మోను ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవడం ఉత్తమం.

స‌హ‌జంగా మెల‌టోనిన్ ఎక్కువగా ల‌భించే పిస్తాను ప్రతిరోజు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల నిద్రలేని సమస్యను అధిగమించవచ్చు. అలాగే గోరువెచ్చని పాలలో అంతే బాదం,తేనె,కుంకుమపువ్వు కలిపి సేవిస్తే
కుంకుమపువ్వులో క్రోసిన్, సఫ్రానాల్ ,పిక్రోక్రోసిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. కావుననిద్రలేమిసమస్యకు ,డిప్రెషన్
ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు పనుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్న బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను పరిమితంగా తీసుకుంటే మంచి నిద్ర కలుగుతుంది. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.