జీర్ణశక్తి లోపాన్ని మెరుగుపరచాలంటే ప్రతిరోజు ఈ పండ్లు తినాల్సిందే?

మనలో జీర్ణశక్తి లోపిస్తే మన శరీర అవయవాలకు అందాల్సిన న్యూట్రిషన్ సరిగా లభించవు దాంతో అన్ని అవయవాల పనితీరు దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.క్రమ పద్ధతిలేని ఆహారపు అలవాట్ల, శారీరక శ్రమ లోపించడం, నీళ్లు తక్కువగా తాగడం వంటి కారణాలతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తి అజీర్తి, గ్యాస్టిక్ , విరోచనాలు, మలబద్ధకం, పుల్లని తేపులు వంటి అనారోగ్య లక్షణాలు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి. జీర్ణ సమస్యలను తొలగించుకొని జీర్ణశక్తిని పెంపొందించుకోవాలంటే రోజువారి ఆహారంలో ఇప్పుడు చెప్పబోయే పండ్లు కచ్చితంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు తెలియజేస్తున్నారు.

ప్రతిరోజు బాగా పండిన బొప్పాయి పండు ఆహారంగా తీసుకుంటే బొప్పాయిలో సమృద్ధిగా ఉండే డెంటరీ ఫైబర్, ప్రొఫైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను, కొవ్వు పదార్థాలను సులువుగా విచ్చిన్నం చేసి జీర్ణశక్తిని పెంచుతుంది దాంతో మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజు జామ పండ్లను తింటే విటమిన్ సి సమృద్ధిగా లభించడంతోపాటు మన జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.

రోజుకొక అరటిపండు మనలో పోషకాహార లోపాన్ని సవరిస్తుంది. అలాగే అరటి పండులో సమృద్ధిగా ఉన్న ఫైబర్ ప్రేగు కదలికలను సులువుగా చేసి జీర్ణ శక్తిని పెంచడంతోపాటు అనేక అల్సర్లను తగ్గించడంలో సహాయపడు. మామిడిపండు తింటే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే జీర్ణాశయంలోని చెడు మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. కివి పండులో ఉన్న అక్టినిడిన్ అనే ఎంజాయ్ సంక్లిష్ట ప్రోటీన్స్ ను సులువుగా జీర్ణం చేయడంలో సహాయపడి జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రతిరోజు యాపిల్ పండ్లను తింటే మనలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. యాపిల్లో అధికంగా లభించే పెక్టిన్ పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం, అతిసారం వంటి సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. అరుదుగా లభించే ఆఫ్రికాట్ పండ్లు తరచూ తింటే జీర్ణశక్తిని పెంచుతుంది. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.