శీతాకాలంలో క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలీ జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, విటమిన్ ఏ, సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయోటిన్ గుణాలు పుష్కలంగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బ్రోకలీ కొంత ఖరీదైనప్పటికీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తరచూ ఆహారంలో తీసుకుంటూనే వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం ఉండే శీతాకాలంలో ప్రతిరోజు బ్రోకలీ జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు.
ప్రతిరోజు బ్రోకలీ జ్యూస్ తాగేవారికి సమృద్ధిగా ఐరన్ విటమిన్ ఏ, పోలిక్ ఆమ్లం సమృద్ధిగా లభించి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది దాంతో ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా
బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో అద్భుతంగా సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది.
అతి బరువు సమస్యతో బాధపడేవారు తరచూ ఉదయాన్నేబ్రోకలీ జ్యూస్ను సేవిస్తే ఇందులో అధికంగా లభ్యమయ్యే పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగించి రోజంతా మీరు తీసుకునే క్యాలరీల పరిమాణాన్ని తగ్గిస్తుంది. తద్వారా సులువుగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు. అలాగే మన శరీరం కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా నియంత్రించడంలో తోడ్పడి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది.బ్రొకోలీలో విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి కావున మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలో సహాయపడి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. గ్యాస్టిక్ మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తరచూ బ్రోకలీ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.