ప్రోస్టేట్ గ్రంథి (Prostate Gland) అనేది పురుషుల యొక్క మూత్రాశయం మరియు పురుషాంగం మధ్యలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఇది వీర్యాన్ని రక్షించే మరియు పోషించే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి మగవారిలో సరైన ఉత్పత్తి లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వల్ల వాపుతో బాధపడటం. అలాగే మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది, లేదా తరచూ మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది, ఈ విధంగా అది అతని రోజువారీ జీవితంలో ఇబ్బందిని కలిగిస్తుంది. యూరాలజికల్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, 50 ఏళ్లు పై బడిన పురుషులలో వచ్చే సర్వసాధారణమైన ప్రోస్టేట్ సమస్య. దీని గురించి చాలా మందికి అవగాహన లేక ఏవేవో కొత్త కొత్త చికిత్సలు అన్నీ తీసుకుంటుంటారు. 85 సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి, 90% మంది పురుషులు ఈ సమస్యతో బాధపడుతుంటారు.
ఇక ఈ సమస్యలకు వైద్య సలహాలు కాకుండా మన రోజువారి ఆహారమార్పులు అలాగే మనం ప్రతిరోజు చేయవలసిన కొన్ని చిట్కాల గురించి ఈ రోజు మన ఈ శీర్షికలో తెలుసుకుందాం. గుమ్మడికాయ మరియు పుచ్చకాయ విత్తనాలను అధికంగా తినాలి. గుమ్మడికాయ గింజల్లో జింక్ మరియు యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ ఏమున్నా కూడా పోతాయి. అంతేకాక ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. మూత్రాశయం లోపలి వ్యర్ధాలని వెలికితీయడానికి మరియు మూత్రాశయ సమస్యలకు చికిత్స చేయడానికి పుచ్చకాయ విత్తనాలను ఉపయోగిస్తారు. ఇక ఈ గ్రంథి పెరుగుదల చికిత్సలో ఈ రెండూ ఉపయోగకరంగా ఉంటాయి.
గ్రీన్ టీలో ‘కాటెచిన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ను దరిచేరకుండా చేస్తాయి. మీ డైట్‌లో గ్రీన్ టీని చేర్చడం వల్ల అది ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలను ఎదుర్కోవడంలో చాలా వరకు సహాయపడుతుంది. కొవ్వు ఉండే చేపలను ఆహారంలో తీసుకోండి. మనం చేపలు కొనేటప్పుడే వాటికి కొవ్వు ఉన్నాది చూసి కొనాలి. అదేవిధంగా, సోయా ఉత్పత్తులను చేర్చుకోవడం కూడా ప్రోస్టేట్ గ్రంథి సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువ తీసుకోవటం కూడా చాలా వరకు సహాయపడుతుంది.
అదే విధంగా రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగటం చాలా ముఖ్యం. మధ్యపానం అనేది శరీరంలో ఉండే కొన్ని సెక్సువల్ నరాలను దెబ్బ తీస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండడం చాలా మంచిది. 50 ఏళ్లు నిండిన తర్వాత ప్రోస్టేట్ గ్రంథి పరీక్షను అప్పుడప్పుడు చేయించుకోవడం చాలా ముఖ్యం.