మఖానా గింజల్లో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం, ఫాస్ఫరస్ తోపాటు ఎన్నో సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.మఖానా గింజలను తామర గింజలు అని కూడా పిలుస్తారు.వీటిని రుచికరమైన చిరుతిండిగా లేదా కూరల్లో, సైడ్ డిష్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని పచ్చిగా తింటేనే అధిక పోషకాలు లభిస్తాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. తరచూ మఖాన గింజలను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
మఖానా గింజలను రోజువారి ఆహారంలో తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు,ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వ్యాధికారక కణాలతో సమృద్ధిగా పోరాడి పొట్ట క్యాన్సర్, ప్రేగులోని అల్సర్లను, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్ వంటి ప్రమాదకర వ్యాధుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.
తీవ్ర ఒత్తిడి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు మఖాన తిని గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే మానసిక ఒత్తిడి తొలగి నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
తరచూ అత్యధిక ప్రోటీన్స్ ఫైబర్ ఉన్న మఖాన గింజలను తినడం వల్ల మనలో అతిగా ఆకలి వేయడాన్ని నియంత్రించి బొడ్డు చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు శరీర బరువును నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మఖాన గింజల్లో పుష్కలంగా ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి గ్యాస్టిక్ మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. మఖానా గింజలను తరచూ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు సహజంగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు వీరు మఖాన నీ ఆహారంగా తీసుకుంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది.