పురుషులలో వంధ్యత్వ…. ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెంటనే వైద్యుని సంప్రదించండి!

ఈ రోజుల్లో పెళ్లయిన దంపతులు ఎదుర్కొనే సమస్యల్లో సంతానలేమి సమస్య ప్రధానమైనది గానే చెప్పొచ్చు. సంతానలేమి సమస్యకు కారణాలను పరిశీలిస్తే జన్యుపరమైన కారణాలు,ఆరోగ్య కారణాలను ప్రధానంగా చెప్పొచ్చు. పురుషుల్లో వంధ్యత్వ లక్షణాలు భార్య భర్తలు ఇద్దరిని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం.వంధ్యత్వ కారణాలవల్ల సంతానలేమి సమస్య తలెత్తి చాలా జంటలు విడిపోవలసి రావడం బాధాకరమైన విషయమే. పురుషుల్లో వింధ్యత్వ లక్షణాలు ఈ సమస్యపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ,పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడానికి వంధ్యత్వ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సమస్య మహిళలు గర్భం దాల్చకుండా నిరోధించి తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేడు ప్రతి ఏడు జంటలలో ఒకరికి సంతానలేమి సమస్యలు ఉన్నాయి. అంటే వారు గత 6 నెలలు లేదా ఒక సంవత్సరంలో గర్భం దాల్చడానికి ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేదని అర్థం. ఈ సమస్య ఇలాగే కొనసాగితే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.

పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గి సంతానలేమి సమస్య తలెత్తడానికి రోజువారి ఆహార పలవాట్లు, పని ఒత్తిడి, సెక్స్ పట్ల అవగాహన లేకపోవడం, స్త్రీ పురుషులు శారీరకంగా మానసికంగా పరినీతి చెందకపోవడం, వంటి కారణాల వల్ల కూడా సంతానలేమి సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మానసిక వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక్కొక్కసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి.వృషణాల్లో నొప్పి, వాపు, గడ్డలు ఉండి అంగస్తంభన లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా సంతానలేమి సమస్య ఏర్పడుతుంది. మన శరీరంలో హార్మోన్లు, క్రోమోజోమ్ వ్యత్యాసం వల్ల పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి పై ప్రభావం పడి వంధ్యత్వ లక్షణాలకు దారితీస్తుంది.