భారత్ లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ లో భాగంగ ముక్కు ద్వారా చుక్కల మందు పంపిణీ!

చైనాలో కరోనా వైరస్ ప్రమాదకర ఘటికలు మోగిస్తుండడంతో ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఆరోగ్య సంస్థలు ముందస్తు చర్యలు వేగవంతం చేశారు అందులో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూనే కరోనా వైరస్ ను కట్టడి చేసే ఏకైక మార్గం అయినా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయడానికి భారత్ తో సహా అన్ని దేశాల ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.వ్యాక్సినేషన్‌ సాధ్యమైనంత వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రికాషనరీ డోస్ కచ్చితంగా తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ క్రమంలోనే అత్యవసర వినియోగం కింద బయోటెక్ సంస్థ తయారు చేసిన ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్‌ను వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో చేర్చుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవీషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు చెందిన కొర్బెవాక్స్‌ టీకాలు Co-WIN పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా బయోటెక్ సంస్థ తయారు చేసిన BBV154 NCOVACC ను ఈ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. ఇప్పుడున్న వ్యాక్సిన్ లకు భిన్నంగా NCOVACC సూది అవసరం లేకుండా ముక్కు ద్వారా చుక్కల రూపంలో ఈ వ్యాక్సిన్ అందిస్తారు.

నూతనంగా అందుబాటులోకి వచ్చిన నాజల్ వ్యాక్సిన్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లోకి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ కింద ఈ నాసల్ వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండడంతో మన కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా కరోనా ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.కోవిడ్ పరీక్షలు జీనోమ్ సీక్వెన్సింగ్ను పద్ధతులో త్వరతిగతిన ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రాలకు సూచించింది.