మనం తీసుకునే ఆహారంలో వస్తున్న సమూలమైన మార్పుల కారణంగానే ఎక్కువమంది చిన్న వయసులోనే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు. రోజువారి అవసరమైన నీటి నిల్వలు శరీరానికి లభించకపోవడంతో మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంది.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ కారణంగా ఎక్కువ మందికి కిడ్నీ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో జరిగే కొన్ని మార్పుల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులను మొదట్లోనే గుర్తించవచ్చు. మొదట్లోనే వీటిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే డయాలసిస్, కిడ్నీల మార్పిడి వంటి సమస్యలు తొలుగుతాయి.
మనలో జరిగే కొన్ని సాధారణ లక్షణాలను బట్టి కిడ్నీ సమస్యలను మొదట్లోనే గుర్తించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.మూత్రం ద్వారా మాత్రమే కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ని సులభంగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, భరించలేని కడుపునొప్పి ఉండడం, మూత్రం వెళ్ళినప్పుడు దుర్వాసన రావడం, మూత్రంలో రక్తం పడడం, దప్పిక ఆకలి వేయకపోవడం, ఉదయం లేవగానే వాంతులు వికారంగా ఉండడం వంటి లక్షణాలు మనలో కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి.
అలా కాకుండా ఈ లక్షణాలను సాధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే అధిక ఇన్ఫెక్షన్ కారణంగా కిడ్నీ దెబ్బతింటుంది. ఇది ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి కిడ్నీ మార్పిడి కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎంత బిజీ లైఫ్ ఉన్న మన ఆరోగ్యం పై కొంత శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే
దీర్ఘకాలంలో వచ్చే ఇలాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.