ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి పల్లె ప్రజలకు సుపరిచితమైన మొక్క విరిగి చెట్టు. ఈ మొక్క పొలాల గట్ల వెంబడి రోడ్ల వెంబడి ఎక్కువగా దర్శనమిస్తుంది. సాధారణంగా విరిగి కాయలు జూలై ఆగస్టు మాసాల్లో ఎక్కువగా కాస్తుంటాయి. విరిగి కాయలు గోలీల పరిమాణంలో ఉండి లోపల జల్లి పదార్థం మధురమైన తీపి రుచి కలిగి ఉంటుంది.అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని బంక కాయల చెట్టు, బంకీర్ చెట్టు,నెక్కర కాయ చెట్టు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పేరుతో పిలుస్తూ ఉంటారు. వీటిని పక్షులు ఎంతో ఇష్టంగా తింటుంటాయి. ప్రకృతి సిద్ధంగా లభించే విరిగి పండ్లను ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా సహజ సిద్ధంగా దొరికే విరిగిపండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో రకాల వ్యాధులను దూరం చేయడంతో పాటు మన శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ఫైబర్ క్యాల్షియం,ఐరన్, పాస్పరస్ వంటి సహజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.విరిగి పండ్లను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రించబడి ప్రమాదకర డయాబెటిస్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని అనేక పరిశోధనల్లో తేలిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విరిగిపండ్లలో పుష్కలంగా క్యాల్షియం ,ఫాస్ఫరస్ లభిస్తుంది కావున కీళ్ల నొప్పుల సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం ,అజీర్తి వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.సంతానలేమితో బాధపడే వారు వీర్యకణాలు తక్కువగా వున్నవారు ఈ పండ్లు తింటే వీటిలో ఉన్న సహజ ఔషధ గుణాలు పురుషుల్లో వీర్యకణాల వృద్ధి చెందడానికి సహాయపడతాయి.
చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిచేసి ఆ మెత్తటి చూర్ణాన్ని చర్మంపై మర్దన చేసుకుంటే వీటిలో ఉన్న యాంటీ మైక్రోవేల్ గుణాలు చర్మ సమస్యలను అదుపు చేయడంలో సహాయపడతాయి. విరిగి పండ్లను బాగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే తినాలి. వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవడం మంచిది లేకుంటే కడుపునొప్పి , అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.