Home News వెల్లుల్లి పొట్టు తీయడం ఇబ్బందా..? ఇలా ట్రై చేయొచ్చు..!!

వెల్లుల్లి పొట్టు తీయడం ఇబ్బందా..? ఇలా ట్రై చేయొచ్చు..!!

వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయని పెద్దలు చెప్తూంటారు. ‘డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిస్తుంది. విషపదార్థాలను తరిమికొట్టే లక్షణాలు ఉంటాయి. సూక్ష్మ క్రిములు చంపగలిగే శక్తి ఉంటుంది. యాంటి సెప్టిక్ గుణాలు ఉంటాయి. పరగడుపునే ఏమీ తినకుండా వెల్లుల్లిని తింటే బాడీ మెటబాలిజం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. గుండె జబ్బులు, హార్ట్ఎటాక్, కాన్సర్ వంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. బ్రెయిన్ కూడా చురుగ్గా పని చేస్తోంది. అధిక బరువును తగ్గిస్తుంది’ అని ఆరోగ్య నిపుణులు మరింతగా చెప్తున్నారు.

Rosner Peelinggarlic | Telugu Rajyam

వెల్లుల్లి వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాడే పద్దతి కొందరికి విసుగు తెప్పిస్తుంది. ఎక్కువగా చేస్తే వేళ్లు, గొళ్లలో మంట పుడుతుంద కూడా. తొక్క తీసి కట్ చేయడంలో ఇబ్బంది పడుతూంటారు. దీంతో కొందరు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే వెల్లుల్లిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహిస్తూంటారు. అటువంటి వారి కోసమే కిచెన్ హ్యాక్స్ అందుబాటులోకి వచ్చింది. ఎంతో ఈజీగా వెల్లుల్లిపాయను పీల్ చేయొచ్చు. సులభంగా కట్ చేసే విధానంపై కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అందులో వెల్లుల్లి తొక్క తీయడంపై ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.

 

ఆ విధానం చూస్తే ఇంతేనా.. ఇంత ఈజీనా అనుకోకుండా ఉండలేరు. దీనిపై ఓ లుక్కేయండి. ఒక వెల్లుల్లిపాయని తీసుకుని.. నిమ్మకాయను కట్ చేసినట్టు కట్ చేయాలి. రెండు భాగాల్లో ఒక దానిని తీసుకుని తొక్క పైకి ఉండే లాగా పెట్టాలి. కత్తితో వెల్లుల్లిపాయను ఐదారు సార్లు కొట్టాలి. వెల్లుల్లిపాయ తొక్కలు వచ్చేయడమే కాకుండా.. సగానికి కట్ అవుతాయి. ఇది ఎంతో ఈజీ పద్ధతి. నిముషంలోపే ఈ విధానంలో వెల్లుల్లిని కట్ చేయొచ్చు. వంటలోకి వెంటనే ఉపయోగించొచ్చు. విసుగు రాదు.. ఆలస్యం కాదు.. వేళ్లు, గోళ్లు మంట పుట్టదు.

- Advertisement -

Related Posts

షడ్రుచుల ‘ఉగాది పచ్చడి’ ఆరోగ్యానికి ఎంతో మేలు..!

వేసవి ప్రారంభమయ్యాక వచ్చే ‘ఉగాది’ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. షడ్రుచుల సమ్మేళనంతో చేసుకునే ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని సృశిస్తుందని అంటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు కారం.. ఇలా...

తిరుపతి లోక్ సభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలట.!

  సినీ నటి హేమ, పార్టీలు మారీ.. మారీ.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చిన్న హాల్ట్ వేసినట్టున్నారు. కాస్సేపటి క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారామె. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,...

వాలంటీర్లే వైసీపీకి స్ట్రాంగ్ పిల్లర్స్.?

  పార్టీ కార్యకర్తల సంగతెలా వున్నా, వాలంటీర్లను ఉద్దేశించి పదే పదే ప్రశంసిస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా, ఉగాది నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను...

Latest News