నిమ్మ పానీయాన్ని ఉదయాన్నే సేవిస్తున్నారా… అయితే ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి?

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో ఉండే సహజ ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఒక్క నిమ్మకాయలు దాదాపు 53 మిల్లీగ్రాముల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కావున వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటుంది.ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహకరిస్తాయి.
3 గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ రసాన్ని ప్రతిరోజు సేవిస్తే ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు. అయితే నిమ్మ రసాన్ని ఏ సమయంలో తాగాలి. ఎన్నిసార్లు తాగాలి అనే విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట నిమ్మకాయ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తాజా నిమ్మకాయ రసాన్ని , తేనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే నిమ్మ పానీయాన్ని మన శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలి.గ్యాస్టిక్, ఉబ్బసం,విరేచనాలు, వాంతులు సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున నిమ్మ పానీయాన్ని సేవిస్తే నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సమస్యను మరింత తీవ్రతం చేస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నోళ్లు భోజనం చేసిన తర్వాత అరగంటకు నిమ్మ పానీయాన్ని సేవించడం మంచిది.

నిమ్మకాయల్లో అధికంగా ఉండే సిట్రిక్ యాసిడ్ , విటమిన్ సి ఐరన్ ను గ్రహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కావున ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్లు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ను సమృద్ధిగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట, నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తొలుగుతాయి.

నిమ్మకాయలు సమృద్ధిగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా చేసి వృద్ధాప్య చాయాలను అరికడుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో నిమ్మకాయ రసం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. లివర్ ఇన్ఫెక్షన్లను అదుపు చేసి ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ప్రతిరోజు నిమ్మరసాన్ని భోజనం చేసిన అరగంటకు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నీళ్లను ఎక్కువగా తాగడం, చల్లని పానీయాలను తీసుకోవడం చేయరాదు. అలా చేస్తే జీర్ణక్రియ రేటు తగ్గి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో బాధపడాలి.