రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కారణం ప్లాస్టిక్ పాత్రల్లో నీటిని నిల్వ ఉంచితే నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు త్వరగా వృద్ధి చెంది మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాగి పాత్రల విశిష్టతను గుర్తించి నీటిలోని సూక్ష్మజీవులను నశింపజేయడానికి రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచుకొని తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. రాగి పాత్రల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిని శుద్ధి చేయడానికి రాగి పాత్రలను ఉపయోగించడానికి కారణం రాగి పాత్రలపై సూర్యకిరణాలు పడినప్పుడు సూర్య కిరణాలతో రాగి ఖనిజం లోని ఔషధ గుణాలు రసాయన చర్య జరగడం వల్ల నీటిలోని ప్రమాదకర సూక్ష్మజీవులు నశిస్తాయి. అలాగే రాగి ఖనిజం లోని ఔషధ గుణాలు నీటిలో కలిసి అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.
రాగి పాత్రలో నీటిని నిల్వ చేసుకొని తాగడం వల్ల నీటిలోని ప్రమాదకర బ్యాక్టీరియా ,వైరస్లు నశించి డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను సోకకుండా మనల్ని కాపాడుతుంది. మన శరీరంలో కాపర్ నిల్వలు తక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రాఖీ పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాపర్ సమృద్ధిగా లభించి థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు.
ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే ఎముకలు దృఢంగా తయారై కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ , ఆర్థరైడ్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడే న్యూరాన్ కణాలకు కవచంలా ఉపయోగపడే మైలిన్ తొడుగులు తయారుకావడానికి కాపర్ సహాయపడుతుంది కావున రాగి పాత్రల్లో నిల్వ ఉంచి నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.