సాధారణంగా చాలామంది ఎక్కడ కూర్చున్నా కూడా వారికి కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది అయితే కొన్నిసార్లు పెద్దవాళ్ల ముందు కూర్చున్నప్పుడు కూడా ఇదే అలవాటు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా ఇలా కాళ్లు ఊపుతో కూర్చోవడం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇలాంటి అలవాట్లు వాళ్ల జీవితంతో మర్చిపోలేరు. ఎంత ప్రయత్నించినా అవి మన నుంచి దూరం కావు. మరి కొన్ని అయితే ఎవరు చెప్పినా వినకుండా.. వాటిని ఫాలో అవుతూ ఉంటారు.
ఇలా ఎక్కడ కూర్చున్న కాలు ఊపుతూ కూర్చున్నారు అంటే అందుకు గల కారణం ఆందోళన, పని ఒత్తిడికి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పని చేస్తున్న సమయంలో ఇంట్లోని ఎవరైనా చూసి అలా చేయడం మంచిది కాదని చెప్పినా వారి మాట వినరు. వారి మాటలు పెడచెవిన పెడతారు. ఇక నిద్ర సరిగ్గా పట్టకపోవడం.. హర్మోన్ల సమతుల్యత కారణంగా ఇలా జరుగుతందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాటికి ఎలా చెక్ పెట్టాలి…ఈ అలవాటు నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్నికి వస్తే..
ముందుగా వైద్యులను సంప్రదించి ఐరన్ మాత్రలు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలట. టీ, కాఫీలు ఎక్కువగా అలవాటు చేసుకుంటే మంచిదని.. ఉదయం కన్నా రాత్రి ఎక్కువగా నిద్రపోయే సమయంలో ఫోన్ అస్సలు చూడకూడదంటున్నారు. సాధ్యమైనంతగా.. టీవీ, ఫోన్ చూడటం తగ్గిస్తే మంచిది. ఈ విధమైనటువంటి చిట్కాలు పాటించడం వల్ల కాళ్లు ఊపే అలవాటు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.