పిల్లల మరణాలకు కారణమవుతున్న స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ను కట్టడి చేసే పీసీవీ-14 వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి!

మనలో వ్యాధి నిరోధక శక్తి రోజుకు క్షీణిస్తుండడంతో మనపై అనేక ప్రాణాంతక వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ జీవులు మనలో తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత చలికాలం సీజన్లో వైరస్ల వ్యాప్తి అధికంగా ఉండడంతో తీవ్రమైన న్యుమోనియా సమస్యలను ఎదుర్కొంటూ ఒక్కొక్కసారి ప్రాణాపాయస్థితి కూడా వెళ్తున్నారు. ఈ న్యుమోనియా వైరస్లను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని భావించి అనేక ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేస్తూ వ్యాక్సిన్ల తయారీపై దృష్టి సాధించారు.

గత కొంతకాలంగా భారతదేశంతో సహా ప్రపంచ దేశాలని కలవరపెడుతున్న స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ఐదేళ్ల లోపు చిన్నారుల మరణానికి కారణమవుతూ తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ స్ట్రెప్టోకస్ న్యుమోనియా వైరస్ ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) వినియోగానికి డీసీజీఐ అనుమతి లభించిందని
బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల ఆనందం వ్యక్తం చేశారు.సాధ్యమైనంత త్వరగా పీసీవీ-14 వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.

నూతనంగా అందుబాటులోకి వచ్చిన పీడియాట్రిక్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14)భారత్ లో అధికంగా వ్యాప్తి చెందుతున్న 22ఎఫ్, 33 ఎఫ్ రకం స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పీసీవీ-14 వ్యాక్సిన్ ను 6, లేదా 10, లేదా 14 వారాల వయసులో శిశవులకు ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు కారణమవుతున్న న్యుమోనియాను నిరోధించేందుకు వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వెల్లడించింది.