మీ పిల్లలు ఈ చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

శీతాకాలం సీజన్లో ఎక్కువగా చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి.ముఖ్యంగా చిన్నపిల్లల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దులు వచ్చి దురద సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. కొందరిలో దురద సమస్య మరి ఎక్కువగా ఉండటం వల్ల గోళ్లతో గోకడం వల్ల గాయమై రక్తస్రావం కూడా కలుగుతుంది. శీతాకాలం సీజన్లో పిల్లల్లో ఎక్కువగా వచ్చే ఇలాంటి చర్మ సమస్యను ఎగ్జిమా అని పిలుస్తారు. ఈ సమస్య 100 మంది పిల్లల్లో దాదాపు పది మందికి ఈ సమస్య వేధిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన చర్మ సమస్యగా మారే ప్రమాదం ఉంది.

పిల్లల్లో పోషకాహార లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఎగ్జిమా చర్మ సమస్యకు ప్రధాన కారణం చర్మం పై పొరల్లో పిలాగ్రీన్ అనే ప్రోటీన్ లోపించడమే ఈ చర్మ సమస్యకు ప్రధాన కారణమని చెబుతున్నారు చర్మంలో ఈ ప్రోటీన్ లోపిస్తే త్వరగా తేమను కోల్పోయి పొడి చర్మం గా మారుతుంది దానికి తోడు వాతావరణ మార్పులు కారణంగా తీవ్ర సమస్యగా తలెత్తి పిల్లలకు కాళ్లు, చేతివేళ్లు,భుజాలు, ముఖం, నడుము భాగం తదితర భాగాల్లో చర్మం పొడిబారి తీవ్రమైన దురద వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలు చర్మ సమస్య మరి తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలి. శీతాకాలం సీజన్లో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సి కలిగిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. చిన్నపిల్లల చర్మాన్ని ఎప్పుడూ ప్రేమగా మృదువుగా ఉంచడానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్‌ సబ్బులు, బాడీ లోషన్ వంటివి వంటివి వాడాల్సి.మందమైనా, బిగుతైన దుస్తులను పిల్లలకు వేయకూడదు. పిల్లల గోర్లను ఎప్పటికప్పుడు నేయిల్ కట్టర్ తో శుభ్రం చేస్తుందని. పిల్లలకు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయిస్తూ ఉతికిన బట్టలని వేయాలి. మట్టిలో ఆడుకున్న వెంటనే చేతులను శుభ్రం చేయించాలి. వీలైనన్నిసార్లు నీళ్లు ఎక్కువగా తాగిస్తే పిల్లల చర్మం పొడిబారకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలను చలి నుంచి రక్షణ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.