అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారా… ఇలా చేస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు!

ఆయుర్వేద వైద్యంలో కానుగ చెట్టుకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది.ఈ చెట్టులోని ఆకులు,గింజలు, బెరడులో ఎన్నో ఔషధ గుణాలు మన అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతున్నాయి. ముఖ్యంగా కానుక చెట్టును రైతు నేస్తాలుగా చెబుతుంటారు.ఆర్గానిక్ వ్యవసాయంలో భూమిని సారవంతం చేయడంలోనూ,చీడపీడలను అదుపు చేయడంలో కానుగ ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి.కానుగ చెట్లు వాతావరణంలోని గాలిని ప్యూరిఫై చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీటిని ఇంటి పరిసరాల్లోనూ పార్కుల్లోనూ, రోడ్లకు ఇరువైపులా, కార్యాలయాల్లో ఎక్కువగా నాటుతున్నారు.

పల్లె వాతావరణంలో ఎక్కువగా కనిపించే కానుగ చెట్లు చల్లని నీడని ఇవ్వడంతో మనలో వ్యాధికారకాలను తొలగించే ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి.
సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కోరింత దగ్గు, పొడి దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి రెండు గ్రాముల కానుగ గింజ‌ల పొడిలో తేనెను క‌లిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గజ్జి, తామర, సోరియాసిస్, దురద, మొటిమలు వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు
కానుగ చెట్టు ఆకుల‌ను,జిల్లేడు ఆకుల‌ను, జాజి ఆకుల‌ను స‌మానంగా తీసుకుని గోమూత్రంతో క‌లిపి మెత్త‌నీ మిశ్రమంగా చేసుకొని చ‌ర్మంపై రాయ‌డం వ‌ల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోతాయి.

మూత్రశయ ఇన్ఫెక్షన్, మూత్రంలో రాళ్లు పడడం వంటి సమస్యలతో బాధపడేవారు 3 గ్రా కానుగ గింజ‌ల పొడినీ ఆవు పాలల్లో క‌లిపి తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గి కిడ్నీలో రాళ్ల సమస్య కూడా దూరమవుతుంది.
కానుగ గింజల పొడిని ఒక గ్రాము మోతాదులో తేనెతో క‌లిపి ఇవ్వ‌డం వ‌ల్ల పురుషుల్లో వ‌చ్చే వృష‌ణాల వాపు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కానుగు లో ఉండే ఔషధ గుణాలు కంటి సమస్యలను చెవి సమస్యలను కూడా దూరం చేస్తాయి. అతి మూత్ర వ్యాధితో బాధపడేవారు కానుగ పూల‌ను పొడినీ మూడు గ్రాముల చొప్పున గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు అతిమూత్ర వ్యాధి కూడా నయమవుతుంది.