వేగంగా వ్యాపిస్తున్న మరో కరోనా కొత్త వేరియంట్? అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రముఖ వైద్య నిపుణులు!

కరోనా వైరస్ గత మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రూపాల్లో తన పరినీతి పెంచుకుంటూ ప్రజలపై దాడి చేస్తూ తీవ్ర అనారోగ్యాన్ని కలిగించడమే కాకుండా లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. గత నెలలో చైనాలో తీవ్రంగా విజృంభించి లక్షలాదిమంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ BF.7 సృష్టించిన విలయ తాండవాన్ని ప్రపంచ దేశాలు మరవకముందే మరో కొత్త వేరియంట్ అమెరికా దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోందని ప్రముఖ వైరాలజిస్ట్ ఎరిక్ హెచ్చరించారు.

తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ఎరిక్ అమెరికాలో తీవ్రస్థాయిలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోందని ట్విటర్ వేదికగా
వెల్లడించారు.కరోనా కొత్త వేరియంట్ XBB15 అమెరికాలో వ్యాప్తి చెందుతోంది. గత వేరియంట్‌లతో పోల్చి చూస్తే 120% అధిక వేగంతో ఇది వ్యాప్తి చెందుతుందని అంచనా వేశారు. ఇప్పటికే యూకేలో XBB15 వేరియంట్‌ వ్యాప్తి వారం రోజుల్లోనే 0-4.3%కి పెరిగిందని ఎరిక్‌ వెల్లడించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం పది రోజుల్లో XBB15 కరోనా కొత్త వేరియంట్‌ 10% కి అధికమవుతుందని ఈ వైరస్‌తో అగ్రరాజ్యంలో మళ్లీ విధ్వంసం చూస్తాం అని హెచ్చరించారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలందరికీ శ్రేయస్కరమని సూచించడం జరిగింది
గత సంవత్సరంతో పోలిస్తే జనవరి నెలలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయి తీవ్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన ఆంక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి అంతర్జాతీయ ప్రయాణికులపై కఠినమైన ఆంక్షలు విధించింది. ముందున్న రోజుల్లో పండగ సీజన్ అధికంగా ఉండడంతో ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తన వంతు బాధ్యతలను నిర్వర్తించాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.