కడుపులో ఇన్ఫెక్షన్లను తగ్గించి అద్భుతమైన కషాయం… ప్రతిరోజు సేవిస్తే ఫలితం గ్యారెంటీ!

ఎన్నో సహజ ఔషధ గుణాలున్న బిర్యాని ఆకులతో రుచికరమైన టి నీ తయారు చేసుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు.ఈ మధ్యకాలంలో బిర్యానీ ఆకుల టీ బాగా ప్రాచుర్యం పొందింది.యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్,యాంటీ వైరల్ గుణాలు బిర్యానీ ఆకుల్లో మెండుగా ఉంటాయి కాబట్టి వీటి కషాయాన్ని ప్రతిరోజు తాగితే సీజనల్గా వచ్చే నిమోనియా, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
బిర్యానీ ఆకులో లినూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉండడం వలన ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.బిర్యానీ ఆకుల టీ ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అధికంగా పెరిగే శరీర బరువును నియంత్రించుకోవచ్చు.

కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కడుపులో మంట వాపు సమస్యలు తలెత్తుతాయి వీటి నుంచి ఉపశమనం పొందడానికి బిర్యానీ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సాధారణ కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.బిర్యానీ ఆకుల్లో పుష్కలంగా ఉన్న ఔషధ గుణాలు రక్తంలోని చక్కర నిల్వలు తగ్గించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి.బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడి పొట్ట క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

ఎన్నో ఔషధ గుణాలు ఉండి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బిర్యాని ఆకుల టి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదట రెండు లేదా మూడు పచ్చి బిర్యానీ ఆకులు లేదా ఎండు బిర్యానీ ఆకులను సేకరించి చిన్న ముక్కలుగా కట్ చేసి తగినన్ని నీరు పోసి బాగా మరగనిచ్చిన తర్వాత వడగట్టుకొన్న తర్వాత వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు సేవించినట్లయితే సకల వ్యాధులకు సర్వరోగ నివారిలా పనిచేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.