కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లను సైతం కరిగించే అద్భుతమైన దివ్య ఔషధం!

కిడ్నీలో రాళ్లు అనగానే సర్జరీ తప్పదని చాలామంది భావిస్తుంటారు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యను సునాయాసంగా ఎటువంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిగమించవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో కిడ్నీ ఇన్ఫెక్షన్లకు, మూత్ర సంబంధిత వ్యాధులను అదుపు చేయడానికి కొండపిండి ఆకు మొక్కను ఎన్నో సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఉపయోగించి అద్భుత ఫలితాలను పొందారు. కొండపిండి ఆకు మొక్కను పిండి కూర ఆకు మొక్క,పాషాణభేది మొక్క,
తెలగపిండి మొక్క అని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కొండపిండి ఆకు మొక్కను ఉపయోగించి కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పల్లె వాతావరణంలో పొలం గట్ల వెంబడి, పచ్చిక బయల లో ఎక్కువగా దర్శనమిచ్చే కొండపిండి ఆకు మొక్కను మన పెరట్లో కూడా పెంచుకోవచ్చు. కొండపిండి ఆకు మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా చేసుకొని తగినన్ని వాటర్ లో బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన కషాయానికి పటిక బెల్లాన్ని కలుపుకొని ప్రతిరోజు అల్పాహారానికి ముందే సేవిస్తే ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటికి పంపించడంతోపాటు మూత్రాశయ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది.

కొండపిండి ఆకు మొక్క ఆకులను తాలింపు పెట్టుకొని లేదా పప్పులో వేసుకొని తింటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కొండపిండి మొక్క వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయాన్నే కషాయంగా చేసుకొని ప్రతిరోజు సేవిస్తే శరీరంలోని చెడు మలినాలు తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. కొండపిండి మొక్క ఆకులను గుప్పెడు తీసుకొని బాగా నమిలి రసాన్ని మింగిన కూడా కిడ్నీ పనితీరు మెరుగుపడి చెడు మలినాలను బయటకు పంపి అనేక ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.