శీతాకాలం మరియు వర్షాకాలం లాంటి తడి వాతావరణంలో మనం అనేక శ్వాసకోశ వ్యాధులతో పోరాటం చేయక తప్పదు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారుతరచూ జలుబు,దగ్గు, గొంతు నొప్పి మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు.
ఈ సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగితే భవిష్యత్తు
సైనుసైటిస్, బ్రాంకై టిస్, న్యుమోనియా,ఫారింజైటిస్, టాన్సిలైటిస్ వంటి ప్రమాదకర శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఎన్ని మందులు వాడిన తక్షణ ఉపశమనం లభిస్తుంది కానీ శాశ్వత పరిష్కారం దొరకదు.
శ్వాసకోశ వ్యాధులకు ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కార మార్గం చూపబడింది.ఆయుర్వేద వైద్యంతో వ్యాధి తీవ్రత తగ్గడానికి లేదా నయం కావడానికి కాస్త ఎక్కువ తీసుకున్నా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధులను అదుపు చేయవచ్చు.
మన ఇంట్లో దొరికే లేదా ఇంటి పరిసరాల్లో పుష్కలంగా లభించే సహజ వనరులను ఉపయోగించి శ్వాసకోశ వ్యాధులైన దగ్గు ,జలుబు ,తలనొప్పి వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తేనె కలుపుకొని సేవిస్తే శరీరంలోని వ్యర్ధాలు అన్ని తొలగిపోతాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అన్ని వ్యాధులను ఎదుర్కొనవచ్చు. అలాగే సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు, తుమ్ములు వంటి అలర్జీలను తొలగించుకోవచ్చు.
ప్రతిరోజు కొన్ని తులసి లేదా పుదీనా ఆకుల కషాయాన్ని తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ అలెగ్జిటిక్ లక్షణాలు సీజనల్గా వచ్చే వ్యాధులతో పోరాడి మనకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్న మిరియాలను కషాయంగా చేసి అందులో తేనె కలుపుకుని ప్రతిరోజు సేవిస్తే శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది.
తరచూ దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసం వంటి సమస్యలతో బాధపడేవారు పల్లెల్లో విరివిరిగా లభించే
జిల్లేడు మొగ్గలను సేకరించి వాటిని కషాయంగా చేసి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు,దమ్ము, జలుబు మొదలైన శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు ఉన్న అల్లం రసంతో తేనెను కలుపుకొని సేవిస్తే గొంతు నొప్పి ,జలుబు వంటి శ్వాసకోశ వ్యాధులను అదుపు చేయవచ్చు.