మీ ప్రస్టేషన్ మహేష్ పై చూపెడతే ఎలా?

సంక్రాంతికి తెలుగులో వచ్చిన సినిమాలను వరస పెట్టి చూస్తూ వాటి రివ్యూలాంటి తన అభిప్రాయాలను మహేష్ ట్విట్టర్ లో చెప్తున్నారు. రాజమౌళి గతంలో ఇలా చేసేవారు. ఇప్పుడు మహేష్ ఆ భాధ్యత తీసుకున్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన మొదట ఎన్టీఆర్..కథానాయకుడు చిత్రం చూసి అద్బతం అని, క్రిష్ గీసిన పెయింటింగ్ అంటూ పొగిడారు. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.

ఇక ఆ తర్వాత రజనీకాంత్ చిత్రం పేట ను చూసి…రజనీ ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా ఓ ట్రిబ్యూట్ అని ట్వీట్ చేసారు. రజనీ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ సినిమా చూసి, వెంకటేష్ ని, వరుణ్ తేజని తెగ పొగిడారు. తను బాగా ఎంజాయ్ చేసానని ట్వీట్ చేసారు. ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.

ఇక మిగిలింది ఒకే ఒక సినిమా అదే..వినయ విధేయ రామ. ఈ సినిమా ని మరి మహేష్ చూసారో లేదో తెలియదు. ఇవన్నీ చూసిన మహేష్ అది ఒక్కటీ ఎందుకు ఎవాయిడ్ చేస్తాడు. దానికి తోడు…ఆ సినిమా దర్శకుడు బోయపాటి నెక్ట్స్ సినిమా కూడా ప్లానింగ్ ఉందంటున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా చూసే ఉంటాడు. అయితే ఆయన రివ్యూ మాత్రం ఇవ్వలేదు.

దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు. తమ హీరో సినిమా ఫ్లాఫ్ అని ప్రచారం చేస్తున్నా..కలెక్షన్స్ ఏ సూపర్ హిట్ కు తీసిపోని విధంగా ఉన్నాయని..ఈ నేపధ్యంలో మహేష్ తన అభిప్రాయం చెప్తే ఈ సినిమాపై బాగుండేది కదా అంటున్నారు.  అయితే మహేష్ అభిమానులు కొందరు మీ హీరో సినిమా పోయిందని ప్రస్టేషన్ మొత్తం మా హీరో పై చూపితే ఎలా అంటున్నారు. సోషల్ మీడియాలో జరిగే రచ్చలు ఇలాగే ఉంటాయి మరి