ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఏ సినిమా డైరక్ట్ చేసినా అందులో ఏదో స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటారు. కధ, కాస్టింగ్ ఇలా ప్రతీ విషయంలోనూ ఆయన తీసుకునే జాగ్రత్తలు సినిమాని ఓ రేంజికి తీసుకెళ్తూ ఉంటాయి. తమిళ సూపర్ స్టార్ రజనీ,కమల్ లతో వరసగా సినిమా చేస్తున్న ఆయన ఇప్పుడు యంగ్ బ్యాచ్ పై దృష్టి పెట్టారు. తమిళంలో సూపర్ స్టార్స్ గా వెలుగుతున్న విక్రమ్, విజయ్ కుమాలిద్దరినీ కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఓ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇదొక సరదా సరదాగా సాగే కామెడీ అని, ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.
ఇక ‘2.0’వంటి గ్రాఫిక్స్ మాయాజాలం తరువాత శంకర్ మరో ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. గతంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందోప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ను శంకర్ రూపొందిస్తున్నారు.
రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన ఈ చిత్రయూనిట్.. హఠాత్తుగా షూటింగ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. అక్కడ వేసిన సెట్లు శంకర్‌కు సంతృప్తినివ్వలేదని, మళ్లీ సెట్‌ను రీక్రియేట్చేసేవరకు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో కమల్ హాసన్‌కు జోడిగా.. కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మరో హీరోయిన్గా కొరియన్ భామ సూజీ బే కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.