‘కొబ్బరిమట్ట’ : సంపూర్ణేష్ బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా
హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిన సంపూ .. అ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన ఆడలేదు. దీనితో హృదయకాలేయం టీమ్ మళ్ళీ కొబ్బరిమట్ట సినిమాతో సంపూని రీలాంచ్ చేస్తున్నట్లుగా ప్రేక్షకుల ముదుకు తీసుకు వచ్చింది . నిజానికి సినిమా ఎప్పుడో మొదలయింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలకి నోచుకోలేదు .ఎన్నో అడ్డంకుల మధ్య ఈ శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి హిట్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంపూర్ణేష్ బాబు ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడనేది ఇంట్రస్టింగ్ విషయం మారింది.
అయితే సంపూ ఎంత తీసుకున్నాడనేది అఫీషియల్ గా బయిటకు రాలేదు కానీ, అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం..రోజుకు లక్ష వరకూ పే చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఎక్కువ వర్కింగ్ డేస్ ..మూడు పాత్రలు కావటంతో కొంత గిట్టు బాటు అయ్యిందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత సంపూ రెమ్యునేషన్ ని రోజుకు మూడు లక్షలు దాకా పెంచాడంటున్నారు. తాను ఇంకా ఆర్దికంగా సెటిల్ కాలేదని చెప్పే సంపూ..తనను వెతుక్కుంటూ వచ్చి సినిమా చేస్తాను అనే వాళ్లకు రెమ్యునేషన్ పరిగణనలోకి తీసుకోకుండా చేస్తాడని వినికిడి.
ఇక కొబ్బరిమట్ట చిత్రంలో తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో బాగానే నవ్వించాడు సంపూ.. దానికి తగినట్లే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడుతున్నాయి. గీతా ఆర్ట్స్ అండతో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. దాంతో పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యిందని, ఫస్ట్ వీక్ లో వచ్చేది ఇంక లాభమే అంటున్నారు. ఈ నేపధ్యంలో నైజాంలో కూడా స్క్రీన్స్ పెంచుతున్నారు.
ఈ సినిమా క్రెడిట్ మొత్తం సంపూకి చెందుతుంది. సినిమా మొత్తాన్ని సంపూ తన భుజాల పైన వేసుకొని నడిపించాడు . పెదరాయుడు , ఆండ్రాయిడ్ ,పాపారాయుడు అనే మూడు పాత్రల్లో సంపూ నటన చించి ఆరేసాడు . చాలా సీన్స్ లో తనదైన విలక్షణమైన డైలాగు డెలవరీతో వావ్ అనిపిస్తాడు. ఇక షకీలా ,కత్తి మహేష్ మరికొందరు నటినటులు కూడా బాగా చేసారు.