సరిపోయింది…’డిస్కోరాజా’ కూడా ఆ సినిమా కాపీయేనా?

సరిపోయింది…’డిస్కోరాజా’ కూడా ఆ సినిమా కాపీయేనా?

ఒకే డీవిడి ఇద్దరు డైరక్టర్స్ చూసి, ఇద్దరు సినిమా చేయాలని ఫిక్సైతే , ఒకే కథతో రెండు సినిమాలు వస్తాయి. ఏది ముందు వస్తే దానికి ఆదరణ ఉంటుంది. అయితే రిలీజ్ కు ముందు దాకా ఇద్దరికీ టెన్షనే. కోర్ పాయింట్ ఒకటే అయ్యినప్పుడు సీన్స్ కూడా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం సైతం ఇలాంటి టెన్షన్ లోనే పడిందిట.

టచ్ చేసి చూడు , నేలా టిక్కెట్టు . అమర్ అక్బర్ ఆంటొని అంటూ వరస పెట్టి మూడు డిజాస్టర్ సినిమాలు ఇచ్చాడు మాస్ మహా రాజా రవితేజ. ప్రస్తుతం ఆయనకు ఓ హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగా రెగ్యులర్ స్టోరీ తో కాకుండా డిఫరెంట్ పాయింట్ తో ముందుకు వెళ్తున్నాడు. అదే డిస్కో రాజా. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీ లో షూటింగ్ ను జరుపుకుంటుంది.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం1999 లో వచ్చిన ‘బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్’ అనే ఇంగ్లీష్ సినిమా కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ఆ సినిమా చాలా హిలేరియస్ గా ఉంటూ కొన్ని థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో జయం రవి , కాజల్ జంటగా నటిస్తున్న కోమలి కూడా ఇదే కాన్సెప్ట్ తో వస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్దమవుతుంది. దాంతో రవితేజ డిస్కోరాజా కూడా ఇదే కాన్సెప్ట్ తో ఉందని, ఆ టీమ్ కు టెన్షన్ పట్టుకుందిట.

ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకుల్లా ద్విపాత్రాభినయం చేయనున్నారు. రవితేజతో ‘నేల టిక్కెట్టు’ నిర్మించిన రామ్‌ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్, ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ అంధురాలి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్‌ కానుంది.