కొత్త ఛానెల్‌ పెడుతున్న TV9 రవి ప్రకాశ్, పేరేంటంటే…

కొత్త ఛానెల్‌ పెడుతున్న TV9 రవి ప్రకాశ్, పేరేంటంటే…

రకరకాల పరిణామాలతో,వివాదాలతో, కేసులతో టీవీ9 ఛానల్ నుండి బయటకు వచినటువంటి మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు తన ప్రస్దానాన్ని మరోసారి మొదలు పెట్టబోతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన ఓ కొత్త టీవీ ఛానెల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సపోర్ట్ ఇవ్వబోతోందని వినపడుతోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రవిప్రకాష్ పెట్టబోయే ఛానెల్ పేరు R Plus. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన ఆఫీస్ నుంచి పనులు మొదలయ్యాయని చెప్తున్నారు. తనను వీడని మీడియా సన్నిహితులు కొందరితో ఈ ఛానెల్ ప్రారంభం అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. ఈ మేరకు ఆర్దికంగా ఏ ఇబ్బంది లేదని, ఇప్పుడు ఆ ఛానెల్ ని జనాల్లోకి తీసుకెళ్లటం ఎలా అనేదే పెద్ద టాస్క్ అని చెప్పుకుంటున్నారు. టీవి 9లో బిజీపీ మీదా, మోడీ కు వ్యతిరేకంగా కథనాలు రాసి, శబరిమలై ఎపిసోడ్ ని హైలెట్ చేసిన ఆయన ఇప్పుడు అదే బిజీపీ అండంతో మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వటం మాత్రం చెప్పుకోదగ్గ విషయమే.

రీసెంట్ గా రవిప్రకాష్ ఇచ్చిన ఇంటర్వూలో … ఇప్పటికీ టీవీ9 ఛానల్‌లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒకవేళ వీలుపడని పక్షంలో మరో ఛానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. కాబట్టి త్వరలో మనం ఓ కొత్త టీవి ఛానెల్ ని చూడబోతున్నాం అన్నమాట.