మహేష్ తో ఛాన్స్ రావటంతో దర్శకుడు అనీల్ రావిపూడి …గాల్లో తేలిపోతున్నారు.ఈ ప్రాజెక్టుని ఎలాగైనా మెగా బ్లాక్ బస్టర్ కొట్టాలని రాత్రింబవళ్లూ కృషి చేస్తున్నారు. ఓ ప్రక్క స్క్రిప్టు లో మార్పులు..చేర్పులు చేస్తూనే మిగతా పనులు చూసుకుంటన్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారని సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు హీరోయిన్స్ గా సాయి పల్లవి, రష్మిక మందన్నా.. పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కీ యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న హీరోయిన్స్ లో వీళ్లూ ఉన్నారు. మహేష్ తో ఇప్పటి వరకూ నటించలేదు. కాబట్టి కెమిస్ట్రీ కొత్తగా కనిపిస్తుంది.
కాబట్టే వీరిద్దరికే అనిల్ రావిపూడి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మే నుంచి వీళ్ల డేట్లు కావాలి. ఆ భాద్యత దిల్ రాజు తీసుకుంటారు. మహేష్ సినిమా అంటేఏ హీరోయిన్ వదులుకుంటుంది అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. కాబట్టి రష్మిక, సాయి పల్లవి చేతిలో ఉన్న సినిమాల్ని పక్కన పెట్టి మహేష్ తో సై అంటారనటంలో సందేహం లేదు.