‘బిగ్ బాస్’ హౌజ్ లోకి రకుల్ ఎంట్రీ,ఇక రచ్చేగా
బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్నీ ఆ షో కబుర్లే. మీడియా మొత్తం ఆ షో కు సంభందించిన గాసిప్స్, వార్తలతో నిండిపోయింది. దాంతో సినిమా వాళ్లు తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవటానికి ఇంతకుమించిన మార్గం లేదని ఎప్పటిలాగానే భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నాగ్ హీరోగా రూపొందిన మన్మధుడు 2 చిత్రం ప్రమోషన్ కోసం హీరోయిన్ రకుల్ ని బిగ్ బాస్ లోకి రప్పిస్తున్నారు. రకుల్ కనుక హౌజ్ లోకి ఎంటరైతే.. బిగ్ బాస్ సీజన్-3ని ప్రమోషన్ కోసం వాడుకున్న మొదటి సినిమాగా మన్మథుడు-2 నిలుస్తుంది.
గతంలోనూ సీజన్-1కు బిగ్ బాస్ గా వ్యవహరించిన ఎన్టీఆర్, జై లవకుశ సినిమా కోసం బిగ్ బాస్ హౌజ్ ను వాడుకున్నాడు. సీజన్-2కు బిగ్ బాస్ గా చేసిన నాని కూడా దేవదాస్ కోసం హౌజ్ ను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నాగార్జున కూడా అదే పని చేస్తున్నాడు.
ఇక మన్మధుడు 2 లో నాగ్ ది ప్రేమకు ఓకే…. పెళ్లి మాత్రం నో అనే టైపు క్యారక్టర్ . అందుకు తగ్గట్టుగానే “నేను పిల్లల్ని కనను… నా జీవితమే నా బాధ్యత” అనే డైలాగ్ ను పెట్టారు. ఇలాంటి వ్యక్తిని పెళ్లాడ్డానికి రకుల్ ఎందుకు ఒప్పుకుంది ? దీనివెనక ఉన్న కథ ఏంటనేది మన్మథుడు-2 సినిమా.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు మరోసారి మంచి క్యారెక్టర్ దొరికింది. దాదాపు సినిమా మొత్తం వెన్నెల కిషోర్, నాగార్జున పక్కన కనిపించబోతున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు-2 ఆగస్ట్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.