వేరే దారి లేక నాని టైటిల్ మార్చమనే చెప్పాడట

వేరే దారి లేక నాని టైటిల్ మార్చమనే చెప్పాడట

‘జెర్సీ’ హిట్‌ తర్వాత నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతోంది. ఈ మధ్యన రిలీజ్‌ అయిన హిట్ చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’లోని క్రైమ్స్‌ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించిన ఎపిసోడ్స్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’లోను వున్నాయని, అంచేత వాటిని రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

ఇప్పుడు ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని అనుకుంటున్నారని తెలిసింది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ పేరుతో మరో చిన్న సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. వాళ్లు తాము మొదటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసామని అదే టైటిల్‌ని కొనసాగించాలని మొదట భావించారు. అయితే ఆ చిత్ర దర్శకుడు చిరంజీవి ఫ్యాన్ కనుక ‘గ్యాంగ్‌లీడర్‌’ని చిరు బర్త్‌డేకి అంటే ఆగస్టు 22న విడుదల చేస్తున్నాడు.

దీన్ని బట్ట నాని గ్యాంగ్‌లీడర్‌ రావడానికి కరెక్టే …వారం రోజులు ముందే ఆ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. రెండు టైటిల్స్ తో ఒకేసారి రెండు సినిమాలొస్తే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ దగ్గర్నుంచి చాలా విషయాల్లో ఇబ్బందులు తప్పవు. ఎలాగో ఆ చిత్రం కంటే ముందుగా తమ సినిమా విడుదలయ్యే అవకాసం లేదు కనుక టైటిల్‌ మార్చుకోవడమే బెస్ట్ అని నాని డిసైడ్‌ అయినట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కానీ త్వరలోనే కొత్త టైటిల్‌ అనౌన్స్‌ అవుతుందని తెలిసింది.

మరోపక్క ‘వి’ అనే  సినిమాలోనూ నాని హీరో పాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇందులో సుధీర్‌బాబు మరో హీరో. నివేదా థామస్‌, అదితి రావు హైదరి హీరోయిన్స్.