డిఫరెంట్ కాన్సెప్ట్ ని తన కథాంశాలుగా ఎంచుకుంటూ అటు విమర్శకులు ఇటు ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి సరిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖరారు చేశారు.
జనవరి 26 రిపబ్లిక్ డే తో పాటు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుదల చేశారు.దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా అంతా బాగానే ఉంది కానీ షూటింగ్ మొదలు కాలేదు. రవితేజ గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్నారు. అందుకు కారణం స్క్రిప్టు సమస్యలే అని తెలుస్తోంది. గతంలో అయితే రవితేజ వాటిని లైట్ తీసుకునేవాడే కానీ ప్రస్తుతం ఆయన తన సినిమా లు ప్లాఫ్ లకు కారణం స్క్రిప్టు బాగోపోవటమే అని అర్దం చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గత నాలుగు నెలలుగా చాలా సార్లు స్క్రిప్టు నేరేషన్ వినటం ..మార్పులు చేయటం జరుగుతోందంటున్నారు.
స్క్రిప్టు ఈ మధ్యన పూర్తైంది లాక్ చేద్దాం అనుకున్న సమయంలో సమంత నటిస్తున్న చిత్రం సైతం దాదాపు అలాంటి కథతోనే రెడీ అవుతోందని తెలిసింది. దాంతో ఆయన మళ్ళీ స్క్రిప్టు ఛేంజెస్ అడిగారట. ముఖ్యంగా కొన్ని సీక్వెన్స్ లు మార్చమన్నాడట. దాంతో దర్శకుడు మళ్లీ తన రైటింగ్ టీమ్ తో రాత్రింబవళ్లూ కూర్చుంటున్నాడట. త్వరలోనే స్క్రిప్టుని పూర్తి గా లాక్ చేసి మార్చి మొదటి వారం నుంచి షూట్ కు వెళ్లాలని అనుకుంటున్నారట.
నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… రవితేజ గారు ఇప్పటివరకు టచ్ చేయని జానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ విన్నూత్నమైన ఆంశాన్ని ఈ సినిమా కథాంశంగా తీసుకున్నాం. మా బ్యానర్ వాల్యు ని మరింత పెంచే విధంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించబోతున్నాం. హైదరాబాద్ తో పాటు గోవా, చెన్నై, లడాఖ్, మనాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాము.
దర్శకుడు విఐ ఆనంద్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు అందించబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి శ్రీరామ్ వ్యవహరించనున్నారు. అబ్బూరి రవి ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో రవితేజ గారి సరసన నటించనున్నారు. ప్రముఖ నటుడు బాబీసింహా ఈ సినిమాలో ప్రతినాయకుడుగా నటించబోతున్నారు. కమీడియన్స్ వెన్నెలకిషోర్, సత్య తదితరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నాం అని తెలిపారు.