జనవరి 20 నుంచి సెట్స్‌పైకి  పవన్ కళ్యాణ్  ‘పింక్’

Pawan Kalyan's Pink shooting
సినిమాలకు గ్యాప్‌నిచ్చి రాజకీయాల్లో బిజీ అయిపోయిన తరువాత  పవన్ మళ్లీ స్క్రీన్‌కు వస్తాడా? అన్న అనుమానాలు ఫ్యాన్స్‌ని ముసిరాయి. అయితే, పాలిటిక్స్‌ని బ్యాలెన్స్ చేస్తూనే పవన్ మళ్లీ స్క్రీన్స్‌కు రానున్నాడన్న కథనాలు నిజమై.. ఎట్టకేలకు ‘పింక్’దగ్గర ఫుల్‌స్టాప్ పడింది. అప్పటి నుంచీ ఫ్యాన్స్ మళ్లీ పింక్ రీమేక్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆశగా చూడటం కనిపిస్తున్నదే. పింక్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  
 
పింక్‌తో పవన్ రీఎంట్రీ కన్ఫర్మ్ అయిపోవడంతో  సినిమాను నిర్మించనున్న దిల్‌రాజు అందుకు తగిన సన్నాహాలు చకచకా చేస్తున్నాడట. వేణ శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా -జనవరి 20నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా పవన్ క్యారెక్టర్, ఆయన పాత్రతో చేయాల్సిన కాంబినేషన్ సీన్స్‌ని పక్కనపెట్టి, మిగతా సినిమాను పూర్తి చేయడానికి దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. పవన్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న తరువాత  అతని పాత్ర, కాంబినేషన్ సీన్స్‌ని షూట్ చేస్తారని తెలుస్తోంది. అంటే  పవన్ రీఎంట్రీ ప్రాజెక్టు పింక్ రీమేక్ కోసం దిల్‌రాజు ఆతృత చూపిస్తున్నాడన్న మాట.
 
బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న పింక్, తమిళ రీమేక్‌తోనూ సక్సెస్‌ను నిలబెట్టుకుంది. కథాబలం ఉన్న చిత్రానికి పవన్ రీఎంట్రీ అనే బోనస్ చేరింది 
 
Pawan Kalyan’s Pink will start shooting from January 20th per source. Pawan Kalyan will participate in shooting once the political dust in AP settles down.