డ్యాషింగ్ డైరెక్టర్ స్పీడ్ మామూలుగా లేదుగా
`ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా అటు రామ్‌కు, ఇటు పూరీ కెరీర్‌కి మంచి బూస్ట్‌నిచ్చింది. ఈ సక్సెస్‌ని రామ్ క్యాష్ చేసుకోలేకపోయినా పూరి మాత్రం బాగానే వాడుకుంటున్నాడు. ఇస్మార్ట్ హిట్ ఎఫెక్ట్‌తో వెంటనే రౌడీ హీరో విజయ్ దేవరకొండని దారిలో పెట్టిన పూరి జగన్నాథ్ వెంటనే పనిలోకి దిగిపోయాడు. మాఫియా నేపథ్యంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాకు `ఫైటర్` పేరుని ఖరారు చేశారని ప్రచారమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించడానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు.
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత పూరి జన గణ మన ప్రాజెక్ట్‌ని కేజీఎఫ్ హీరో యష్‌తో చేయబోతున్నాడంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం కేజీఎఫ్ పార్ట్ 2 ప్రారంభానికి ముందు హీరో యష్‌ని పూరి కలిశాడని, రెండు, మూడు స్క్రిప్ట్‌లు వినిపించాడని ప్రాచారమైంది. అయితే అవేవీ యష్‌కు నచ్చలేదని తెలిసింది.
దీంతో పూరి మరో హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టారని, ఇటీవలే రెబల్‌స్టార్ ప్రభాస్‌కు స్టోరీ లైన్ వినిపించడం, డార్లింగ్ వెంటనే ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని తెలుస్తోంది. అయితే పూరి వైపు నుంచి కానీ.. ప్రభాస్ వైపు నుంచి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. పూరీకి డార్లింగ్ చాలా సన్నిహితుడు కాబట్టి అప్పటికి లైన్ మాత్రమే విని ఓకే చెప్పాడా? లేక పూర్తిగా స్క్రిప్టు నచ్చేసి ఫైనల్ చేశాడా? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అత్యధిక భాగం యూరప్‌లోనే సాగనుంది. ఈ మూవీ తరువాత ప్రభాస్ మరో చిత్రాన్ని అంగీకరించలేదు. జాన్ (వర్కింగ్ టైటిల్) తర్వాత పూరితోనే డార్లింగ్ సెట్స్ కెళతాడా? అన్నది చూడాల్సి ఉంది.
