యంగ్ హీరోల్లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నావాడు నిఖిల్. ఇండస్ట్రీలో గాఢ్ ఫాధర్ లేకపోయిన్ తన శక్తి, సామర్ధ్యాలని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. ట్రేడ్ లోనూ అతని సినిమాలు మంచి బిజనెస్ చేస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా అతని పరిస్దితి ఏమీ బాగోలేదు. అనుకున్న టైమ్ కు అతని సినిమా రిలీజ్ కాకపోవటం ఆయన అభిమానలను నిరుత్సాహ పరుస్తోంది.
వివరాల్లోకి వెళితే… నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’.చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు.
ఇప్పటికే రెండుసార్లు ప్రకటించిన తేదీకు సినిమా రిలీజ్ కాకపోవడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ మొదలైంది. ఫైనాన్సియల్ ప్లాబ్లంస్ వల్లే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదని కొందరు చెబుతుంటే.. సోలో రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారని మరికొందరి చెప్తున్నారు. ఏదైమైనా రిలీజ్ మాత్రం కాలేదు. దాంతో ఆ సినిమాపై ఏర్పడిన క్రేజ్ మొత్తం పోయింది.
దానికి తోడు ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ జగపతిబాబు హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడింది.
హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. నైజాం ఏషియన్ సునీల్ చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్. నా సినిమాలు పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి హిట్ అయ్యాయి. మళ్లీ ఈ చిత్రం అలాగే జరిగింది. లక్కీగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు.