ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సాధారణంగా నోరు జారరు. ఆచి తూచి మాట్లాడుతూంటారు. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా.. తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కు ముందు ఉత్సాహంతో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి.
ఆడియో రిలీజ్ టైమ్ లో రాఘవేంద్రరావు గారు..ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను 12 సార్లు సార్లు చూస్తానని అన్నారు. ఎన్టీఆర్ తనకు 12సార్లు అవకాశాలు ఇచ్చారని కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ ని పన్నెండు సార్లు చూస్తానని అనటం ఎంకరేజింగ్ గా అన్న మాటలు ఆ రోజుకు అందరికీ ఉత్సాహం తెప్పించింది. అయితే కథానాయకుడు, మహానాయకుడు రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
దాంతో ఇప్పుడు కొందరు నెటిజన్లు రాఘవేంద్రరావు ని ట్యాగ్ చేస్తూ 12 సార్లు సినిమా చూసారా..కథనాయుకుడు అన్ని సార్లు చూసే దమ్ము మీకుందా..? అంటూ రాఘవేంద్రరావుని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ‘మహానాయకుడు’ సినిమా సంగతి తరువాత.. ముందు ‘కథానాయకుడు’ సినిమా ఎన్ని సార్లు చూశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండే రాఘవేంద్రరావు ఇలా దొరికిపోవటం ఆయన అభిమానలకు బాధ కలిగిస్తోంది.
మరో ప్రక్క ‘మహానాయకుడు’ సినిమా విషయానికొస్తే సోమవారం నుండి ఈ సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం థియేటర్ల రెంట్లు కూడా కట్టలేని స్థితిలోకి వెళ్లిపోయింది. మూడు రోజులకు గాను ఈ సినిమా కేవలం రెండు కోట్లనే వసూలు చేసింది.