‘బిగ్ బాస్‌’: ఒక్కో ఎపిసోడ్‌కు నాగార్జునకు ఎంతంటే?

బిగ్ బాస్ 3 ఈనెల 21 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మూడో సీజన్ లోకి అడుగుపెడుతున్న సమయంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 100 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. హోస్ట్‌గా నాగార్జునను ఒప్పించేందుకు ‘స్టార్ మా’ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.12 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కోసం నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.7 లక్షలు అందింది.దాంతో పోలిస్తే ఒక్కో ఎపిసోడ్‌కు నాగార్జునకు రూ.5 లక్షలు అదనంగా అందుతోంది. బిగ్ బాస్ 3 నిమిత్తం నాగార్జునకు దాదాపు రూ.12 కోట్ల మొత్తం దక్కనుంది.

ఇదిలా ఉంటే… గతంలో ‘బిగ్ బాస్’ కాన్సెప్ట్ తనకు నచ్చడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగార్జున…ఇప్పుడు ‘బిగ్ బాస్ 3’ హోస్ట్‌గా ఎందుకు ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. డబ్బుల కోసం దిగజారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరల్డ్ కప్ కారణంగానే బిగ్ బాస్ సీజన్ 3ని ఆలస్యం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో బిగ్ బాస్ హౌస్‌ను సిద్ధం చేశారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్‌లో పాల్గొననున్నారు.