“రెడ్డిగారి అబ్బాయి” గా మహేష్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భ‌ర‌త్ అనే నేను చిత్రం తర్వాత చేసిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా మహేష్ కు మరుపురాని విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా అనంతరం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయబోతున్నారు. అందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఏం టైటిల్ పెట్టబోతున్నారు..మహేష్ క్యారక్టర్ ఏమిటనే విషయమై అనేక వార్తలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి “రెడ్డిగారి అబ్బాయి” అనే వర్కింగ్ టైటిల్ పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో జగపతి బాబు విలన్ రోల్ గా నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక ఈ చిత్రంలో క్యారక్టర్ గురించి మహేష్ మాట్లాడుతూ.. తాను పోలీస్ పాత్ర చేయటం లేదని తేల్చి చెప్పారు. అయితే అది ఎలాంటి పాత్ర అనేది మాత్రం రివీల్ చేయలేదు. పటాస్‌, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 ఇలా వ‌రుస హిట్స్ తో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి కు మ‌హేష్‌ తో చేయటం జాక్ పాట్ లాంటిదే. హిట్ కొడితే వరస స్టార్స్ తో సినిమాలు ఉంటాయి.