షాకింగ్ అప్ డేట్: మిలిట్రీ ఆఫీసర్ గా మహేష్ బాబు

‘ఎఫ్ 2’ చిత్రంతో పూర్తి స్దాయి ఫన్ డైరక్టర్ గా ఎస్టాబ్లిష్ అయిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ ఈ చిత్రంలో ఏ పాత్రలో కనపడతాడా అనే విషయం అభిమానుల్లో చర్చనీయాంసంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు మహేష్ ఈ సినిమాలో ఓ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.

సెలవుల కోసం తన ఊరుకొచ్చిన హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఈ కథ మొదలవుతుందని..ఆ విలేజ్ కామెడీ, కొంత దేశభక్తి మిళితమైన పాత్ర అదని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ శైలిలో సాగే కామెడీనే హైలెట్ అయ్యే విధంగా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారని సమాచారం.

అంతేకాదు పూర్తి కామెడీ అయితే సూపర్ స్టార్ కు దెబ్బ కొట్టేస్తుందని….సినిమాలో దేశభక్తికి సంబధించి ఓ సీక్వెన్స్ కూడా పెడుతున్నారట. ఈ సీక్వెన్స్ లో మహేష్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడు.

మరో ప్రక్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ – చరణ్ దేశ భక్తులుగా నటిస్తున్నారు. ఇప్పుడు మహేష్ కూడా అనిల్ రావిపూడి సినిమాలో ఓ ఎపిసోడ్ లో దేశభక్తుడిగా కనిపించబోవటం చెప్పుకోదగ్గ విశేషం. సినిమాకే ఈ ఎపిసోడ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోందట. ఇక ఈ చిత్రం జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.