గాసిప్స్ : శంకర్, రామ్ చరణ్ సినిమాలో ఈ బాలీవుడ్ బిగ్ స్టార్ ఉన్నాడా??

Ram Charan Shankar

పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయిలో అంచనాలు నెలకొల్పుకొని కొన్ని సినిమాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో శరవేగంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియాస్ విజనరీ డైరెక్టర్ శంకర్ లు ప్రాజెక్ట్ కూడా ఒకటి.

ఇద్దరి కెరీర్ లో కూడా 15వ సినిమాగా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ లో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాని శంకర్ పూర్తిగా తెలుగు సినిమాలానే భారీ విజువల్స్ తో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ షాకింగ్ గాసిప్ అయితే వినిపిస్తుంది.

గత కొన్నాళ్ల కితం ఈ సినిమా కాస్టింగ్ పరంగా పలువురు బిగ్ స్టార్స్ పేర్లు మన టాలీవుడ్ నుంచి వినిపించాయి. అలాగే ఈసారి అయితే బాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. మరి నిన్నటి నుంచి ఈ సినిమాపై వినిపిస్తున్న గాసిప్స్ ఏమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర చేసేందుకు రెడీగా ఉన్నాడట.

అయితే దీని కోసం శంకర్ ఆల్రెడీ సల్మాన్ ని సంప్రదించగా ఓకే చెప్పినట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో అయితే ప్రస్తుతం ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. శంకర్ అయితే ఇప్పుడున్న మూడ్ లో ఇతర భారీ తారాగణం తీసుకున్నట్టు కనిపించలేదు.

మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఇంకో పక్క అయితే సల్మాన్ ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో “గాడ్ ఫాథర్” సినిమాలో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.