రచయిత నుంచి దర్శకుడుగా మారి వరస సక్సెస్ లు కొడుతున్నారు కొరటాల శివ. ఆయన త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆల్రెడీ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే కొరటాల శివ తన బ్యానర్ లో వచ్చే సినిమాలు డైరక్ట్ చేయరట. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ..కాన్సెప్టు ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలనే ఆలచనే ఆయన నిర్మాతగా మారటానికి కారణం అని చెప్తున్నారు.
ఇందుకోసం ఆయన తన స్నేహితుడు సుధాకర్ తో కలిసి నిర్మాణ రంగంలోకి రానున్నారు. అయితే నిర్మాణ సంస్థను ఎప్పుడు స్థాపించేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆయన సమర్పకుడుగా ఉంటారు. తన బ్రాండ్ మీద బిజినెస్ జరుగుతుందని, ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ సినిమా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అంటే కొరటాల శివ సైతం సుకుమార్ దారిలోనే ముందుకు వెళ్ళబోతున్నారన్నమాట.
అలాగే తాను చాలా కథలు నచ్చినా సమయం సరిపోని కారణంగా ఆ చిత్రాలను తాను డైరెక్ట్ చేయలేకపోతున్నానని, అందుకే నిర్మాతగా మారి యువ దర్శకులకు అవకాశాలివ్వాలని కొరటాల భావిస్తున్నారు. భరత్ అనే నేను తరువాత కొరటాల తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు.
కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించనున్నారు. భరత్ అనే నేను తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కొరటాల, చిరంజీవి కోసం ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సినిమా తరువాత కొరటాల శివ ఓ క్రేజీ స్టార్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రీసెంట్ గా ఓ ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు కొరటాల. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌కు కూడా ఫైనల్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. చిరుతో సినిమా పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.