కేఎ పాల్ ని నాగ్ కంట్రోల్ చేయగలడా?

ఎలక్షన్స్ సమయంలో తెలుగురాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ అధినేతలపై మండిపడ్డారు. తన విచిత్ర చేష్టలతో పలువురిని కడుపుబ్బా నవ్వించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి పలువురిని ఆకట్టుకున్నారు. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవాలంటే తన పార్టీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు. అవన్నీ ఎలక్షన్స్ అయ్యిపోయాక ప్రక్కకు వెళ్లిపోయాయి. మీడియాలో ఆయన కామెడీ లేకుండా పోయింది. లేకపోతే ఏదో ఒక ఛానెల్ పిలిచి ఆయన చేత వాగించి పండగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ మరోసారి తెలుగు ప్రేక్షకులకు కలగబోతోందని తెలుస్తోంది. కె ఏ పాల్ మీడియాలో మళ్లీ కనిపించే అవకాసాలు ఉన్నట్లు సమాచారం. అదెలా అంటే..

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ పోగ్రామ్ కి తెలుగులోను మంచి ఆద‌ర‌ణ ల‌భించిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం జూలైలో మ‌రో సీజ‌న్ ప్రారంభం కానుంది. సీజ‌న్ 3ని కింగ్ నాగార్జున హోస్ట్ చేయ‌నున్నారని సమాచారం.

ఈ నేఫధ్యంలో ఈ పోగ్రామ్ లో పాల్గొనే కంటెస్టెంట్స్‌గా ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఆ పేర్లు కూడా ఆసక్తి గొలిపే విధంగా ఉన్నాయి. అలాగే గుత్తా జ్వాల పేరు ప్ర‌ముఖంగా వినిపించిన ఆమె త‌ను పార్టిసిపెంట్ చేయ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ సందేశ్,కమల్ కామరాజు, తీన్మార్ సావిత్రి, సీరియల్ యాక్టర్ జాకీ లు ఈ షో కి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ ముఖి,కే ఏ పాల్ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా కెఎ పాల్ మాత్రం ఉన్నాడా లేడా అనేది పిచ్చ ఇంట్రస్ట్ గా ఉంది. ఉంటే పోగ్రామ్ పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. అయితే కేఏ పాల్ ఒప్పుకుంటాడా అనేదే పెద్ద ప్రశ్న. అదే సమయంలో నాగార్జున ..కేఏ పాల్ ని కంట్రోలు చేయగలడా అనే సందేహాలు సైతం చాలా మందికి అభిమానులకు వస్తున్నాయి. ఎందుకంటే కేఏ పాల్ ని కంట్రోలు చేయటం ఓ మాదిరి జనం వల్ల కాదని అందరికీ తెలుసు. ఆయనేం మాట్లాడతాడో..ఎప్పుడేం నిర్ణయం తీసుకుంటాడో ఊహించటం కష్టమైన పని. 

ఇక షో నిబంధనల ప్రకారం హౌస్ లోకి ప్రవేశించే వరకు కంటెస్టెంట్ ల పేర్లు బయట పెట్టకూడదనే నిబంధన ఉండటంతో ఈ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే పరిగణించాలి. ఈ ఎవిసోడ్ ఎవరికి అవకాశం దక్కింది అని తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.