నలుగురు మనుష్యులు కలిసి పనిచోట ఎప్పుడూ ఏదో ఒక మాట, వివాదం వస్తూనే ఉంటాయి.అయితే వాటిని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతూంటారు అనుభవజ్ఞులు. ముఖ్యంగా సీనియర్స్…తమ కన్నా చిన్న వాళ్ల కు నటన విషయంలో సలహాలు ఇవ్వటం,దర్శకుడుకి ఐడియాలు ఇవ్వటం చేస్తూంటారు. అది కొంత విసిగించినా సర్దుకుపోతూంటారు. అయితే ఒక్కోసారి అది చిరాకు పెడుతూంటుంది. అలాంటిదే ఓ బేబి సెట్ పై జరిగిందట.
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ కావటంతో రాజేంద్రప్రసాద్ చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారట. అక్కడిదాకా ఎవరికీ ఏ సమస్యా లేదు. కానీ తనతో కాంబినేషన్ సీన్స్ చేసేటప్పుడు సరైన ఎక్సప్రెషన్స్ రావటం లేదని తోటి ఆర్టిస్ట్ లకు సలహా ఇస్తున్నారట. అదీ కూడా సమంతకు. డైరక్టర్ ఒక రకంగా చెప్తే రాజేంద్రప్రసాద్ మరోరకంగా ఇంప్రవైజ్ చేసి ఇలా చేయండని చెప్పారట. మొదట పెద్ద ఆర్టిస్ట్ అని విన్నా ఆ తర్వాత విసుగు వచ్చి ఒక టైమ్ లో అరిచేసిందిట. నందనీ రెడ్డి కూడా విసుక్కుందిట.
అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు. మీడియాలో స్ప్రెడ్ అవుతున్న వార్త ఇది. రాజేంద్రప్రసాద్ గురించి తెలిసున్న వాళ్లు …ఆయనకు ఎంత టాలెంట్ ఉందో అంతకు మించి సెట్ లో అవతల వాళ్లని గౌరవించే గుణం ఉంది. ఆర్టిస్ట్ లకు సలహాలు ఇచ్చే స్కూల్ పొరపాటున కూడా పెట్టుకోరు అని చెప్తున్నారు. ఇది నిజమో, రూమరో కానీ ..రాజేంద్రప్రసాద్ చేస్తోంది మాత్రం తను నటించే సినిమా బాగా రావాలనే కదా అనేది మాత్రం నిజం.