ఇండస్ట్రీ టాక్ : ఫైనల్ గా పవన్ భారీ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి?

harihara veeramallu

టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లో కన్నా పాలిటిక్స్ లో ఎక్కువగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనితో పవన్ సినిమాలు మళ్ళీ  వెళ్లాయి. దీనికి తోడు పవన్ కి మళ్ళీ ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ సినిమాలు మరింత వెనక్కి వెళ్లాయి.

దీనితో ఆల్రెడీ సెట్స్ పై ఉన్న తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. పవన్ ఏ సినిమా చెయ్యకపోయినా పర్వాలేదు. ఈ ఒక్క సినిమా చేసేసి ఇచ్చేస్తే చాలు అని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక దాదాపు ఒక 50 శాతం పూర్తయ్యిన ఈ చిత్రం కి పవన్ కొన్ని సూచనలు ఇచ్చారని, చిన్న చిన్న మార్పులు దర్శకుడు క్రిష్ ని తాను అడగ్గా ఇప్పుడు క్రిష్ వాటిని కంప్లీట్ చేసి పవన్ కి వినిపించాడట. ఇక దీనితో పవన్ ఓకే చెప్పినట్టుగా కూడా భోగట్టా. ఇక దీనితో అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

అని ఇంకా సాధ్యమైనంత త్వరగానే ఈ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ భారీ సినిమాని ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.