ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర అలాగే రాజకీయాల్లో పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు మంచి ఆసక్తిగా వినిపిస్తుంది. అయితే ఇది కేవలం “గాడ్ ఫాదర్” సినిమా వల్లే కాగా ఈ సినిమాకి అనుకున్న రేంజ్ పబ్లిసిటీ అయితే అయితే మెగాస్టార్ సింపుల్ గా తెచ్చుకున్నారు.
అయితే ఈ సినిమాకి అప్పటివరకు ఏదో సాదా సీదాగా ఉంది అనుకున్నప్పుడే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ అవుతున్న బిజినెస్ లెక్కలు ఇప్పుడు సినీ వర్గాల్లో షాకింగ్ గా మారాయి. ఈ సినిమాకి ముందు మెగాస్టార్ నటించిన లాస్ట్ సినిమా ఆచార్య అందుకున్న ఫలితం కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
మరి అలాంటి ఎపిక్ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా మెగాస్టార్ సినిమా భారీ బిజినెస్ ని జరుపుతుందట. నిన్ననే సినిమా జస్ట్ ఓటిటి రైట్స్ 58 కోట్లకి అమ్ముడుపోయినట్టు క్లారిటీ రాగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అలాగే ఓవర్సీస్ లో 16 కోట్లు మేర తెలుగు, హిందీ బిజినెస్ అలాగే నాన్ థియేట్రికల్ హక్కుల్లో సాటిలైట్ మరియు ఆడియో హక్కులు రెండు భాషల్లో కూడా కలిపి సుమారుగా 50 కోట్లకి పైగానే జరిగినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
దీనితో గాడ్ ఫాదర్ బిజినెస్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషించడం వల్ల ఇది అయితే సాధ్యం అయ్యిందని చెప్పాలి. మరి ఈ సినిమాకి ఎలాంటి ఫలితం దక్కుతుందా అని ట్రేడ్ వర్గాలు అయితే ఆసక్తి గా ఉన్నాయి.