యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజే వేరు. `అర్జున్‌రెడ్డి`తో అది మరో సారి ప్రూవైంది. ఆ చిత్రం విడుదల తర్వాత విజయ్ కథల ఎంపికపై మరిన్ని ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే `గీత గోవిందం` వచ్చి సూపర్ హిట్ అయ్యింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సుమారు 100కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడీ చిత్రం హిందీ లోకి రీమేక్ అవుతోంది.
అందుతున్న బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం హిందీ వెర్షన్ ని అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించనున్నారు. రైట్స్ రేటు క్రింద వాటా పెట్టుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఎందుకంటే హిందీలోనూ ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి గీతా ఆర్ట్స్ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతోందని తెలుస్తోంది.
ఇక ఈ రీమేక్ లో యువ హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నారు. అయితే ఇంకా ఈ చిత్రానికి డైరక్టర్ ఖరారు కాలేదు. ‘బియాండ్ ది క్లౌడ్స్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ గత ఏడాది ‘దఢక్’ చిత్రం తో మెప్పించాడు. దఢక్ మరాఠి చిత్రం సైరాట్ కు రీమేక్ గా తెరకెక్కింది.
ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ కథేమీ లేదు. కానీ కథనంతోనూ, ఫన్ తో కూడిన సీన్స్ తోనూ దర్శకుడు మాయ చేశాడు. దానికి విజయ్ దేవరకొండ, రష్మిక టాలెంట్ తోడైంది. దాంతో ఆద్యంతం నవ్విస్తూ… చివర్లో సుతిమెత్తగా హృదయాల్ని మెలిపెడుతూ ఆహ్లాదంగా ముగుస్తుందీ చిత్రం. మరి ఇషాన్ కట్టర్ ఆ స్దాయిలో నటించకపోతే…సినిమా వర్కవుట్ కాదు..ఏం చేస్తారో చూడాలి.