‘డ్రీమ్ గర్ల్’ అట‌కెక్కిన‌ట్టేనా?

Dream Girl Remake

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ వ‌రుస ఫ్లాపులతో డౌన్ ఫాల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజైన `ఇద్ద‌రి లోకం ఒక‌టే` కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా నిలిచింది. తానొక‌టి త‌లిస్తే ఇంకేదో అయ్యింది. ఒక మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరిలో న‌టించాను.. హిట్ట‌వుతుంద‌నే రాజ్ త‌రుణ్ భావించాడు. కానీ ఒక మంచి క‌థ‌ను పేల‌వంగా తెర‌కెక్కించిన ఫ‌లితం క‌నిపించింది.

ఈ ప‌రాజ‌యం త‌ర్వాత చేయ‌బోయే సినిమాపై ప‌డింద‌ట‌. ఇప్ప‌టికే రాజ్ త‌రుణ్ హీరోగా బాలీవుడ్ హిట్ మూవీ డ్రీమ్ గ‌ర్ల్ ని రీమేక్ చేసేందుకు నిర్మాత సురేష్ బాబు ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ. సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫోటోషూట్లు పూర్తి చేశారు. అయితే ఈలోగానే ఇద్ద‌రిలోకం ఒక‌టే రిజ‌ల్ట్ రాజ్ త‌రుణ్ ని పూర్తి సందిగ్ధ‌త‌లో ప‌డేసింద‌ట‌. ఇలాంటి బ్యాడ్ టైమ్ న‌డుస్తున్న‌ స‌మ‌యంలో డ్రీమ్ గ‌ర్ల్ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తే అది త‌న‌కు క‌లిసి రాద‌ని న‌మ్ముతున్నాడ‌ట. 

 
అందుకే ఈ ప్రాజెక్టును వ‌దులుకున్నాడ‌ని ప్ర‌చార‌మవుతోంది. ఆయుష్మాన్ ఖురానా న‌టించిన డ్రీమ్ గ‌ర్ల్ పూర్తిగా ఆఫ్ బీట్ సినిమా. ఇందులో అమ్మాయిగా క‌నిపించే అబ్బాయి గా న‌టించాలి. లేడీ వాయిస్ తో మిరాకిల్స్ చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి ప్ర‌యోగం చేయ‌గ‌ల‌డా? అందుకే వ‌దులుకుంటున్నాడ‌ట‌. అయితే దీనిపై రాజ్ త‌రుణ్ కానీ సురేష్ బాబు కానీ అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది.
 
Dream girl remake is now on hold. Raj Tarun signed up for dream girl remake. Due to the result of Raj Taruns latest release Producers are thinking twice