దిల్ రాజు కొత్త చిత్రం ‘జాను అలియాస్ జానకీదేవి’

ప్రముఖ నిర్మాత  దిల్ రాజు తాజాగా నిర్మిస్తున్న చిత్రం టైటిల్ ని ‘జాను అలియాస్ జానకీదేవి’గా నిర్ణయిస్తున్నట్లు సమాచారం.  తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటంచిన ’96’ రీమేక్ టైటిల్ ఇది.

 హీరో,హీరోయిన్స్ గా శర్వానంద్ – సమంతలను ఎంపిక చేసుకుని షూటింగ్ మొదలెడుతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేయించిన దిల్ రాజు, టైటిల్ కూడా తెలుగులో ఉండేలా మార్చారని సమాచారం.

ఈ సినిమా కోసం ‘జాను’ .. ‘జాను అలియాస్ జానకి’ అనే రెండు పేర్లను పరిశీలిస్తున్నాడట. దాదాపు గా ‘జాను అలియాస్ జానకీదేవి’ నే ఫైనల్ అయ్యే అవకాసం ఉందని సమాచారం. త్వరలోనే ఈ మేరకు ఎనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు .. ఆ రోజున టైటిల్ ను ఎనౌన్స్ చేయడంగానీ.. టైటిల్ లోగోను రిలీజ్ చేయడంగాని జరగొచ్చని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళ వెర్షన్ రూపొందించిన ప్రేమ్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహించబోతున్నారు.